Featured post

*#தளபதி-69 பத்திரிகை செய்தி!*

 *#தளபதி-69 பத்திரிகை செய்தி!* கே. வி. என் புரொடக்ஷன்ஸ் தமது பெருமைமிகு அடுத்த படைப்பான 'தளபதி'விஜய் அவர்களுடன் இணையும் தளபதி- 69 தம...

Saturday 15 July 2023

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌' నిర్మాణంలో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో 'కన్నివెడి

 *'డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌' నిర్మాణంలో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో 'కన్నివెడి’*


*జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన కన్నివెడి చిత్రం పూజతో ప్రారంభమైంది.*






అభిమానుల విశ్వసనీయ చిత్ర నిర్మాణ సంస్థగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నాణ్యమైన నిర్మాణాలను అందించడంతోపాటు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తోంది. 'జోకర్', 'అరువి', 'ధీరన్ అధిగారం ఒండ్రు', 'ఖైది’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుండి వస్తున్న 'కన్నివెడి' మరో వినూత్న చిత్రం.


నూతన దర్శకుడు గణేష్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం 'కన్నివెడి'లో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తోంది. ఇది కధానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం. 


దర్శకుడి అద్భుతమైన ప్రతిభకు ఆజ్యం పోస్తూ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్లింగ్ జర్నీలో తీసుకెళ్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తుంది.


ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు (జులై 15) చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. గాయి. నటి కీర్తి సురేష్‌, నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు, దర్శకుడు గణేష్‌ రాజ్‌, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.


ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ.. ‘‘ఉత్కంఠభరితమైన కథాకథనాలు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో నాణ్యమైన సినిమాగా ‘ కన్నివెడి’ సినిమా ఉంటుందని, సినీ అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందని అన్నారు.

No comments:

Post a Comment